18th Congress of American Telugu Association (ATA) in USA was grandly held in Atlanta on June 7, 8, 9, 2024. Recently, the ATA board meeting was held at the Marriott Hotel in Atlanta on September 8, 9, 10.

అట్టహాసంగా ఆరంభమైన అట్లాంటా 18 వ ఆటా మహాసభ సన్నాహాలకు శ్రీకారం!

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ద్వైవార్షికంగా నిర్వహించు 18 వ మహాసభలను  2024 న జూన్ 7,8 మరియు 9 తేదీ లలో అట్లాంటా లో అత్యంత వైభవోపేతంగా జరుపుటకు గాను 2023 సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో అట్లాంటా లోని మారియట్ హోటల్ లో ఆటా బోర్డు సమావేశం, ఫేస్ ఈవెంట్స్ నందు ఆటా 18 వ మహాసభల కిక్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించబడింది. సెప్టెంబర్ 8 న , శుక్రవారం సాయంత్రం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన మరియు వివిధ  నగరాల్లో సేవలు అందిస్తున్న ఆటా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు, ట్రస్టు బోర్డ్ సభ్యులు,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్డినేటర్, వుమెన్ కోఆర్డినేటర్స్, స్టాండింగ్ కమిటీ, ఆటా అడ్వైజర్స్ పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఆటా అట్లాంటా సభ్యులు మర్యాదపూర్వక స్వాగత సమారోహంతో ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం మరియు అద్వితీయ విందు వినోదాలతో అలరించింది.

మరునాడు సెప్టెంబర్ 9 శనివారం ఉదయం 9 గంటలకు బోర్డు సమావేశం గణనాథుని ప్రార్థనతో ఆరంభమయి, ఆటా అధ్యక్షురాలు శ్రీమతి మధు బొమ్మినేని  సారథ్యంలో, ఉపాధ్యక్షులు జయంత్ చల్లా ,పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల,హనుమంత్ రెడ్డి,కరుణాకర్ మాధవరం,సుధాకర్ పెరికారి మరియు పరమేష్ భీమ్రెడ్డి,  కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి,  సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, ట్రస్ట్ బోర్ద్ సభ్యుల,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ మరియు అట్లాంటా ఆటా బృందం ఆధ్వర్యంలో  నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు.ఆటా సభ్యుల  ప్రోత్సాహభరిత సందేశాలు , మౌలిక సదుపాయాల చర్చ, ఆవశ్యక సేవా కార్యక్రమాలు, భారతదేశంలో డిసెంబర్ నెలలో జరుగు ఆటా వేడుకల చర్చలు, ఆమెరికన్ తెలంగాణ సొసైటి(ATS) సంస్థ విలీనం , సమావేశ  సభ్యుల పరిచయం, మహాసభల తాత్కాలిక అడ్హాక్ బృందం ప్రకటన, ఆర్థిక మరియు సేవా అభివృద్ధి సంబంధిత అజెండా , రానున్న బోర్డు సమావేశపు కీలక నిర్ణయాలు, వంటి పలు కీలక అంశాల అధ్యయనంతో ప్రభావాన్వితంగా సాగడం హర్షణీయం. ఆటా 18 వ సభల కొరకు నియామికమైన కాన్ఫరెన్స్  కన్వీనర్ కిరణ్ పాశం,కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి నేషనల్ కోఆర్డినేటర్  సాయి సుదినిలు ప్రసంగిస్తూ అట్లాంటా తరుపున అందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఆటా సభలకు గాను అందరి సహాయసహకారాలను సవినయంగా కోరుతూ , సభలను గూర్చి పలు అంశాల వివరణ అందించారు. ఆటా మ్యాట్రిమోని కమిటీ కో-చైర్ రమేష్ నల్లవోలు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అట్లాంటాలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసారు. వధూవరులు, తల్లితండ్రులు, మిత్రులు సుమారు 50 కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.అనంతరం కమ్మని విందుతో బోర్డు సమావేశం సంపూర్ణం అయింది.మధ్యాహ్నం ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని , కాన్ఫరెన్స్  కన్వీనర్ కిరణ్ పాశం,ఆటా 18 వ కాన్ఫరెన్స్ బృందం , ట్రస్ట్ బోర్ద్ సభ్యులు,  అట్లాంటా ఆటా బృందం 18 వ మహాసభలను నిర్వహించు  జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్(GWCC) ని సందర్శించి అట్లాంటా నగర వీధుల్లో ప్రత్యేక సందడి చేసారు.

సాయంత్రం 7 గంటలకు అట్లాంటాలోని ఫేస్ ఈవెంట్స్ లో కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ సమావేశం అధ్యక్షురాలు మధు బొమ్మినేని మరియు అట్లాంటా కోర్ సభ్యుల చేత సాంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టుకోగా గణనాథుని ఆరాధనతో శుభారంభ పొందిన  ఆ శుభవేళ కళారాధన తో మొదలయి నీలిమ గడ్డమనుగు నేపథ్యంలో వివిధ శాస్త్రీయ జానపద , చలన చిత్ర గీతికలు నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరి వంటి అద్భుత కార్యక్రమంతో ఆద్యంతం సభాసదుల సావధానత కైవసం చేసుకుంది. ఆటా 18 వ కాన్ఫరెన్స్ లోగో ను ఇటీవల ఎన్నికైన అమెరికా క్రికెట్ బోర్డ్ చైర్మన్ మరియు పూర్వ ట్రస్ట్ బోర్ద్ సభ్యులు వేణు పిసికె ఆవిష్కరించగా, మధు బొమ్మినేని, జయంత్ చల్లా మరియు కిరణ్ పాశం వేణు పిసికె ను సన్మానించారు. మరియు  మధు బొమ్మినేని కాన్ఫరెన్స్ సాంగ్ ఆవిష్కరించబడగా ప్రసిద్ధ గాయకుడు, అద్భుత సంగీత సహకారాన్ని అందించిన దర్శకుడు మల్లికార్జున మరియు సాహిత్య సహకారం అందించిన మాధవి దాస్యంలను అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందించగా,  సభాసదులు ప్రతిధ్వనించు హర్షధ్వానాలతో ఆటా సభ అడ్హాక్ సభ్యులు, సలహాదారులను,  మరియు పూర్వ అధ్యక్షుడు, స్పాన్సర్స్ ను మన్నన పూర్వక హర్షధ్వానాలతో సత్కరించారు.

ఈ శుభప్రద సాయంకాలం సుమారు 600 గౌరవ అతిథుల తో కార్యక్రమం ఆద్యంతం మధురానుభూతులతో ఉల్లాస భరితంగా  కొనసాగింది.శ్రావణి రాచకుల్ల సారథ్యంలో సుందర నారీమణి వస్త్రాలంకరణ ప్రదర్శన (ఫ్యాషన్ షో) వీక్షకులను మంత్రముగ్ధులను చేయగా నూతన మోహన్ , జనార్ధన్ పన్నేల గార్ల అద్భుత గానాలాపన మరియు స్థానిక నాయకులు గానాలాపన జనరంజకంగా సాగింది ఆ శుభ సాయంకాలం. 

కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం 18 వ కాన్ఫరెన్స్ కార్యక్రమాలు గురించి తెలుపుతూ అందరికీ అభినందనలు  తెలియజేశారు.  అట్లాంటా లో ని  స్థానిక తెలుగు సంస్థల  TANA, GATA,GATeS, GTA, NATA,NATS,TTA, TDF మరియు TAMA  ప్రతినిధులను 18 వ ఆటా మహాసభలకు ఆహ్వానించారు మరియు తెలుగు సంస్థల ప్రతినిధులు కూడా 18 వ ఆటా మహాసభ విజయవంతంగా సాగడానికి  సహాయ సహకారాలను అందిస్తామన్నారు.

అధ్యక్షురాలు మధు బొమ్మినేని తమ స్పందన తెలియచేస్తూ కార్యక్రమం అద్భుతంగా , అద్వితీయంగా కొనసాగడానికి కారకులైన విశిష్ట అతిథులు, గౌరవ అతిథులకు , వదాన్యులకు ,  యూత్ వాలంటీర్ కు, అట్లాంటా కోర్ సభ్యులు,  అట్లాంటా కోర్ కాన్ఫరెన్స్ దాతలకు మరియు తదితర మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి తెలియచేశారు.

కొసమెరుపు కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి గారు  తమ కృతజ్ఞతా సందేశాన్ని అందించారు.

సర్వే జనా సుఖినోభవంతు.🙏

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *




Enter Captcha Here :