77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినబసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్

దేశంలో నెలకొన్న జాడ్యాలైన అవినీతి, యువతలో పెరుగుతున్న అలసత్వం, మాదక ద్రవ్యాల వినియోగంపై పోరాడాలని శ్రీ నందమూరి బాలకృష్ణ పిలుపు

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు జాతీయ జెండాను ఎగుర వేసారు. అనంతరం జాతీయ గీతాలాపనతో జెండా వందనం చేశారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారి నుద్దేశించి మాట్లాడుతూ దేశంలో నెలకొన్న పలు జాడ్యాలైన అవినీతి, యువతను పీడిస్తున్న మాదక ద్రవ్యాలు, అలసత్వం లాంటి వాటిపై పోరాడాలని శ్రీ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. భారత దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని ఎందరో మహానుభావులు, విప్లవకార్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని వారు చేసిన త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వేచ్చావాయువులు లభించాయని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజులలో తిండి గింజలకు ఇబ్బంది పడే రోజు నుండి నేడు చంద్రునిపై స్వయంగా కాలూనే స్థాయికి భారత దేశం ఎదిగిందని పేర్కొన్నారు. దేశానికి ఎందరో మహనీయులు సేవలు అందించారని వారిలో ఒకరైన తన తండ్రిగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ సంస్థ గత 23 సంవత్సరములుగా ఎందరో పేద క్యాన్సర్ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తోందని అన్నారు. భవిష్యత్తులోనూ ఈ పంథాలో కొనసాగడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ 77వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశ ప్రజలందరికీ ముఖ్యంగా తెలుగువారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం క్యాన్సర్ పై పోరాడుతున్న చిన్నారులు, వైద్యులతో కలసి మూడు రంగులలో ఉన్న బెలూన్లను గాలిలో ఎగుర వేశారు. తర్వాత కార్యక్రమానికి హాజరైన చిన్నారులకు, పేషెంట్లకు మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమాలలో శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, BIACH&RI; డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. కల్పనా రఘునాథ్, ఆసోసియేట్ డైరెక్టర్, యాడ్ లైఫ్ మరియు అకడమిక్స్, BIACH&RI; డా. ఫణికోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI లతో పాటూ పలువురు మెడికల్ విభాగాధిపతులు, వైద్యులు, వైద్యేతర సిబ్బంది, నర్సింగ్ విద్యార్థి మరియు విద్యార్థిణులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *




Enter Captcha Here :