



మూడు రోజుల పాటు జరిగే ఈ షో, నగరంలోని రెరా ఆమోదం పొందిన ఉత్తమ ప్రాజెక్టులను ఒకే చోట ప్రదర్శిస్తూ, గృహ కొనుగోలుదారులను ‘పర్మనెంట్ హో జావో’ అంటూ ఆహ్వానిస్తోంది.
హైదరాబాద్, 6 ఫిబ్రవరి2026: హైదరాబాద్‌లోని అత్యంత విశ్వసనీయమైన , కొనుగోలుదారుల-కేంద్రీకృత రియల్ ఎస్టేట్ ప్రదర్శన అయిన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026, హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమైంది. ఈ మూడు రోజుల ప్రాపర్టీ షో ఫిబ్రవరి 6 నుండి 8వ తేదీ వరకు హైటెక్స్‌లోని హాల్ 4లో జరుగుతోంది. ఇది క్రెడాయ్ సభ్య డెవలపర్‌లను , రియల్ ఎస్టేట్ రంగంలోని కీలక వాటాదారులను ఒకే విశ్వసనీయ వేదికపైకి తీసుకువచ్చింది. తెలంగాణ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ గౌరవ నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖల మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణ రావు (ఐఏఎస్) తో పాటు, క్రెడాయ్ హైదరాబాద్ సీనియర్ నాయకత్వం, అధ్యక్షుడు శ్రీ ఎన్. జైదీప్ రెడ్డి; ప్రెసిడెంట్-ఎలెక్ట్ శ్రీ బి. జగన్నాథ్ రావు; ప్రధాన కార్యదర్శి శ్రీ కె. క్రాంతి కిరణ్ రెడ్డి, ప్రాపర్టీ షో కన్వీనర్ శ్రీ సుశీల్ కుమార్ జైన్ మరియు కో-కన్వీనర్ శ్రీ ఎన్. వేణుగోపాల్, ఇతర మేనేజింగ్ కమిటీ సభ్యులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు, పరిశ్రమ వాటాదారులు మరియు సందర్శకులు పాల్గొన్నారు.
విశ్వాసం, పారదర్శకత, నైతిక పద్ధతులు మరియు వినియోగదారుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే క్రెడాయ్ యొక్క ప్రధాన సిద్దాంతమైన క్రెడయబిలిటీ ( ‘CREDAIbility’) ఆధారంగా, ఈ ప్రాపర్టీ షో ‘పర్మనెంట్ హో జావో’ అనే నేపథ్యంతో ముందుకు వచ్చింది. ఇది గృహ కొనుగోలుదారులను హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టడానికి మరియు దీర్ఘకాలిక హామీతో ఈ నగరాన్ని తమ శాశ్వత నివాసంగా మార్చుకోవడానికి ప్రోత్సహించే ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన పిలుపు. ఈ ప్రదర్శనలో 300కి పైగా రెరా -ఆమోదం పొందిన ప్రాజెక్టులను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల సందర్శకులు ధృవీకరించబడిన, నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరియు విశ్వసనీయమైన ప్రాజెక్టులను మాత్రమే సంప్రదించగలరనే భరోసా కలుగుతుంది. గృహ కొనుగోలుదారులు హైదరాబాద్‌లోని సుస్థిర నివాస ప్రాంతాలు మరియు అభివృద్ధి చెందుతున్న వృద్ధి కారిడార్లలోని అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాటెడ్ డెవలప్‌మెంట్లు, కార్యాలయ స్థలాలతో సహా సమగ్ర శ్రేణి నివాస మరియు వాణిజ్య ఆఫర్‌లను ఒకే చోట అన్వేషించవచ్చు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, హైదరాబాద్ ఒక ప్రధాన మౌలిక సదుపాయాల పరివర్తనను చూస్తోంది. ప్రస్తుతం నగరంలో రూ.7,000 కోట్లకు పైగా విలువైన అండర్‌పాస్‌లు మరియు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి.” అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ హైటెక్ సిటీ మౌలిక సదుపాయాల ప్యాకేజీలు, ప్రధాన జంక్షన్లలో బహుళ-స్థాయి ఫ్లైఓవర్లు, కీలకమైన రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు , దక్షిణ కారిడార్‌కు అప్‌గ్రేడ్‌లు, కోర్ ఏరియాలు, పెరిఫెరల్ జోన్స్ మరియు అభివృద్ధి చెందుతున్న వృద్ధి కారిడార్‌లలో సమతుల్య అభివృద్ధిని నిర్ధారించడం వంటి ముఖ్యమైన కార్యక్రమాలను గురించి వెల్లడించారు.
మరింతగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2014 తర్వాత విడుదల చేయబడిన తెలంగాణ రైజింగ్ విజన్, ఉపాధి కల్పన, ఆవిష్కరణ మరియు ప్రపంచ పెట్టుబడుల ద్వారా హైదరాబాద్‌ను బలమైన పట్టణ ఆర్థిక కేంద్రంగా నిలబెట్టిందని చెప్పారు. బ్లూ గ్రీన్ మాస్టర్ ప్లాన్, సమగ్ర మొబిలిటీ ప్లాన్ వంటి దీర్ఘకాలిక పట్టణ ప్రణాళిక కార్యక్రమాలు స్థిరమైన, వాతావరణ-అనుకూల వృద్ధిపై దృష్టి సారించాయని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 2020 నుండి రూ. 20,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని, ప్రభుత్వం తమ పూర్తి మద్దతును వీటికి కొనసాగిస్తుందని,
వేగవంతమైన అనుమతులను నిర్ధారించడం, పరిశ్రమతో సన్నిహితంగా పనిచేయడం, ఎన్నికల సమయాల్లో కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపోంచిందటం చేస్తున్నాము అని ఆయన అన్నారు.
క్రెడాయ్ ప్రాపర్టీ షోలో జరిగిన సభలో ప్రసంగించిన తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల & పౌర సరఫరాల మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఒక ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతోందని, గౌరవనీయ ముఖ్యమంత్రి, ఐటీ మరియు పరిశ్రమల మంత్రి ఐటీ, హాస్పిటాలిటీ, పర్యాటక మరియు అనుబంధ రంగాలలో పెట్టుబడులను చురుకుగా ఆకర్షిస్తున్నారని అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, బలమైన శాంతిభద్రతలు మరియు వ్యాపార అనుకూల వాతావరణం ద్వారా నగరాన్ని సౌకర్యవంతంగా జీవించడానికి అనువైన , సరసమైనదిగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. నిజాం కాలం నాటి సమ్మిళితత్వం , విశ్వనగర సంస్కృతి వారసత్వంపై నిర్మించబడిన హైదరాబాద్, వృద్ధి అంచనాలను అధిగమిస్తూనే ఉందని వెల్లడించారు. డెవలపర్లు , పరిశ్రమ వాటాదారులతో నిరంతర అనుసంధానిత కొనసాగిస్తూనే, నీటిపారుదల శాఖ అనుమతులతో సహా పలు శాఖాపరమైన అనుమతులను సులభతరం చేయడానికి ప్రభుత్వం సరళీకృత మరియు డిజిటలైజ్డ్ ఆమోద ప్రక్రియలను మరియు చురుకైన చర్యలను నిర్ధారిస్తోందని ఆయన తెలిపారు.
క్రెడాయ్ ప్రాపర్టీ షోలో జరిగిన సభలో ప్రసంగించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు (ఐఎఎస్) మాట్లాడుతూ, భారతదేశంలో రియల్ ఎస్టేట్ వృద్ధికి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వచ్చే వలసలు అతిపెద్ద చోదక శక్తిగా కొనసాగుతున్నాయని, గృహాలకు మాత్రమే కాకుండా ఆతిథ్యం, రిటైల్, ఆరోగ్య సంరక్షణ మరియు మౌలిక సదుపాయాలకు కూడా డిమాండ్ సృష్టిస్తున్నాయని విశ్లేషించారు. రాబోయే 15 నుండి 20 సంవత్సరాలలో, భారతదేశం అపూర్వమైన రీతిలో పట్టణ వలసలను చూడనుందని , ఇది చైనా పరివర్తనతో పోల్చదగినదని చెబుతూ , ఈ రంగానికి గణనీయమైన అవకాశాలను అది అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ జిడిపికి దాదాపు ఎనిమిది శాతం తోడ్పాటును రియల్ ఎస్టేట్ అందిస్తుందని, వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి అవకాశాలు ఈ రంగంలోనే ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణలో, స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ ఆదాయాలు 2014 నుండి ఐదు నుండి ఆరు రెట్లు పెరిగాయని, ఇది ఎక్కువగా హైదరాబాద్ వృద్ధి కారిడార్ల విస్తరణ ద్వారా జరిగిందని , కోవిడ్ కాలంలో స్వల్ప మందగమనం ఉన్నప్పటికీ, ఈ రంగం బలంగా పుంజుకుందని ఆయన చెప్పారు. వృద్ధిని కొనసాగించడానికి, గృహ కొనుగోలుదారులను రక్షించడానికి మరియు సమ్మిళిత పట్టణ అభివృద్ధిని సాధ్యం చేయటానికి సకాలంలో అనుమతులు, సమర్థవంతమైన నియంత్రణ మరియు పారదర్శకత చాలా ముఖ్యమైనవని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ ఎన్. జైదీప్ రెడ్డి మాట్లాడుతూ, “హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దాని నిర్మాణాత్మక బలం, దీర్ఘకాలిక స్థిరత్వం కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నిలుస్తోంది. స్థిరమైన విధాన దిశానిర్దేశం, చురుకైన పాలన మరియు భౌతిక , సామాజిక మౌలిక సదుపాయాలలో స్థిరమైన పెట్టుబడుల నుండి నగరం ప్రయోజనం పొందింది. ఇవి సమిష్టిగా క్రమబద్ధమైన పట్టణ వృద్ధికి బలమైన పునాదిని సృష్టించాయి. ఇది నివాస విభాగాలలో స్థిరమైన తుది-వినియోగదారు డిమాండ్, పెరుగుతున్న పెట్టుబడిదారుల విశ్వాసం, ఆరోగ్యకరమైన సమతుల్యతకు దారితీసింది. హైదరాబాద్ నేడు తమతో సమానమైన నగరాలతో పోలిస్తే అందుబాటులో ఉండటంతో పాటుగా, ఉపాధి అవకాశాలను విస్తరించడం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడం వంటి బలమైన విలువ ప్రతిపాదనను అందిస్తుంది. గృహ కొనుగోలుదారులకు, ధరల పెరుగుదల యొక్క తదుపరి చక్రం పూర్తిగా ప్రారంభం కాకముందే, దీర్ఘకాలిక వృద్ధి పథంలో స్పష్టంగా నగరంలో పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుత దశ ఒక వ్యూహాత్మక మరియు సరైన అవకాశాన్ని అందిస్తుంది..” అని అన్నారు.
క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ బి. జగన్నాథ్ రావు మాట్లాడుతూ, “హైదరాబాద్ నిర్ణయాత్మకంగా వైవిధ్యమైన ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందింది, సాంకేతిక కేంద్రంగా దాని గుర్తింపును దాటి ఆవిష్కరణ, జీవనశైలి మరియు దీర్ఘకాలిక మూలధన పెట్టుబడికి గమ్యస్థానంగా మారింది. నగరం యొక్క వైవిధ్యభరితమైన ఆర్థిక పునాది, పెరుగుతున్న ప్రపంచ దృశ్యమానత మరియు సమతుల్య పట్టణ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల నాణ్యమైన గృహాల కోసం నిరంతర డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిణామాన్ని ప్రతిబింబించడానికి మరియు ప్రజలు తమ కలల ఇంటిని కొనుగోలు చేసి నగరంలో శాశ్వత నివాసితులుగా మారడానికి ప్రోత్సహించడానికి ‘పర్మనెంట్ హో జావో’ అనే నేపథ్యంతో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించబడుతుంది. ఇది గృహ కొనుగోలుదారులకు పారదర్శకత, ఎంపిక మరియు విశ్వసనీయ డెవలపర్‌లకు ప్రత్యక్ష అవకాశాలను అందిస్తుంది, వారు ఎంపికలను స్పష్టంగా అంచనా వేయడానికి , నమ్మకంగా, పూర్తి సమాచారంతో కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది” అని అన్నారు.
క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ శ్రీ క్రాంతి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ, “రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన సవాళ్లను, ముఖ్యంగా తప్పుదారి పట్టించే ధరలు మరియు కొనుగోలుదారులను మోసం చేసే చట్టవిరుద్ధమైన ప్రీ లాంచ్ మరియు అమ్మకాల సమస్యలను పరిష్కరించడానికి మేము 400 మంది డెవలపర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాము. రెరాతో కలిసి క్రెడాయ్ పనిచేస్తోంది. మేము పూర్తిగా అంకితమైన ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని కలిగివున్నాము. ఏకీకృత భవన నియమావళి కింద అటువంటి పద్ధతులను అరికట్టడానికి సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాము. అధికారులు ముందుకు వచ్చి, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడంలో తక్షణ మద్దతును అందిస్తామని హామీ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. సంప్రదింపుల ద్వారా, మేము 55-పాయింట్ల ప్రతిపాదనను సమర్పించాము, వాటిలో 45 పాయింట్లు ఆమోదించబడ్డాయి, దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఇది ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. మేము డెవలపర్లును ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని మరియు సమాజం పట్ల తమ బాధ్యతను నెరవేర్చాలని కోరుతున్నాను…” అని అన్నారు.
ఈ 3-రోజుల కార్యక్రమం, నగరంలోని ఉత్తమ ఆస్తులను ప్రదర్శించడంతో పాటు, గృహ కొనుగోలుదారులకు నగరం యొక్క అభివృద్ధి , భవిష్యత్తుపై పూర్తి నిష్పక్షపాత దృక్పథాన్ని అందించడానికి రెరా అధికారులు, బ్యూరోక్రాట్లు, రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థలు మరియు పరిశ్రమ నాయకులతో ఆసక్తికరమైన చర్చలను కూడా నిర్వహిస్తుంది. ఇది గృహ కొనుగోలుదారులు నగరంలో శాశ్వత నివాసులుగా మారాలా లేదా నగరంలోనే పెద్ద ఇంటికి మారాలా అనే నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది.
తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్య శాఖల గౌరవ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు గారు ఈ ప్రాపర్టీ షో ను రెండవ రోజున సందర్శించి, డెవలపర్‌లతో సంభాషించి, నగరం యొక్క అభివృద్ధి మరియు వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికలను ప్రజలతో పంచుకునే అవకాశం ఉంది. ఈ హామీ గృహ కొనుగోలుదారులు నగరంలో శాశ్వత నివాసులుగా మారాలనే నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది.
